గొర్రెల పాకల తొలగింపుపై యాదవ్ ఆగ్రహం, తహసీల్దార్ కు వినతి

279చూసినవారు
చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లిలో ప్రభుత్వ భూమిలో గొర్రెల పాకల తొలగింపుపై గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి, ఇది అన్యాయమని, జీవాలకు మేత వనరులు పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. జీవో 559 ప్రకారం ప్రభుత్వ భూములను వినియోగించుకోవచ్చని గుర్తుచేశారు. సంఘ సభ్యులతో కలిసి తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు.

సంబంధిత పోస్ట్