రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. కేసు నమోదు.. ఎస్సై రమాకాంత్

6చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. కేసు నమోదు.. ఎస్సై రమాకాంత్
ఆదివారం తండగొండ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడపెల్లి అనురాగ్ (22) అనే యువకుడు మృతి చెందాడు. అతని స్నేహితుడు పిట్టల అఖిల్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అనురాగ్‌ను కరీంనగర్ అఖిరా హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 02.12.2025 ఉదయం 10.08 గంటలకు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు, బైక్‌ను నిర్లక్ష్యంగా నడిపిన పిట్టల అఖిల్‌పై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్