వైయస్సార్ 17వ వర్ధంతి: కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి

3చూసినవారు
వైయస్సార్ 17వ వర్ధంతి: కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి
చొప్పదండిలోని రామడుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజి హరీశ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసి, వారి జీవితాలను దగ్గరగా చూసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ కోల రమేష్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్