
మార్కెట్ యార్డు మరమ్మత్తుల కోసం 14 లక్షల రూపాయల మంజూరు
బోయినపల్లి మార్కెట్ కమిటీ అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.14 లక్షల నిధులు మంజూరు అయ్యాయని మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ యార్డులో కూలిపోయిన ప్రహరీ గోడ నిర్మాణం, కార్యాలయ మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయించారు. నిధుల మంజూరు పట్ల చైర్మన్ ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, డైరెక్టర్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.







































