
పది పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈఓ శ్రావణ్ కుమార్
బోయినపల్లి మండలంలో శనివారం నుండి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఆరోగ్య వైద్య సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. బోయినపల్లి, విలాసాగర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బోయినపల్లి కేంద్రంలో ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, కోరం, స్తంభంపల్లి, బోయినపల్లి, ఒక ప్రైవేట్ పాఠశాల పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.






































