
కరీంనగర్: విషాదం.. గోదావరిలో దూకి అజయ్ ఆత్మహత్య
ధర్మపురిలో జీవితంపై విరక్తి చెందిన పంపరి అజయ్ అనే యువకుడు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హుజూరాబాద్ కు చెందిన అజయ్, తల్లి మరణంతో మనస్తాపం చెంది, తల్లి కర్మకాండలకు హాజరు కాలేనని బంధువులకు చెప్పి, ఆ తర్వాత ధర్మపురికి వచ్చి గోదావరిలో దూకినట్లు ఎస్సై జి.మహేష్ తెలిపారు. మంగళవారం మృతదేహం లభ్యమవ్వగా, మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






































