ధర్మపురి: పొన్నం ప్రభాకర్ పై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

1చూసినవారు
ధర్మపురి: మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన 'దున్నపోతు' వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. తన సామాజిక వర్గాన్ని అవమానించారని, పొన్నం ప్రభాకర్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారంతో మాట్లాడటం తనకు రాదని, పొన్నం మారకపోతే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తనతో పాటు మంత్రి వివేక్ కూడా ఇబ్బంది పడుతున్నారని, సహచర మంత్రిని అంత మాట అన్నా వివేక్ చూస్తూ ఊరుకున్నారని తెలిపారు. ఈ విషయంపై త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షిలను కలుస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.