జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే అన్ని ఫిర్యాదులను స్వతరమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. సమయపాలన పాటించాలని, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆర్డీవో మధుసూదన్, డీపీఓ రఘువరన్, తహశీల్దార్ వరందన్, తదితరులు పాల్గొన్నారు.