జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ లాడ్జ్ లో మూడు రోజులు ఐదుగురు దుండగులు స్టే చేశారు. కరీంనగర్ పీఎంజేలో జ్యువెల్లరీ షాపు దోపిడీ తర్వాత గోదావరి మీదుగా పారిపోయారు. సమ్మర్ కావడంతో గోదావరి ప్రవాహం తక్కువగా ఉండటంతో, దొంగలు ఒక బైక్‌ను అక్కడే వదిలేసి, మరో బైక్‌పై పరారయ్యారు. పోలీసులు 16 బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. విజయలక్ష్మి లాడ్జ్‌లో సీసీ కెమెరాల్లో దుండగుల దృశ్యాలు నమోదయ్యాయి. దొంగలు ఎటువైపు వెళ్లి ఉంటారని ఆరా తీస్తున్నారు.