విద్యార్థులకు వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహన కలిగించాలని మరియు వాటిలోని విషయాల పట్ల సంపూర్ణంగా సమాచారం ఇవ్వాలని తద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తారని మరియు విషయాలలో పట్టు సాధించడం ద్వారా విజయాలను సైతం సులభంగా నమోదు చేయగలుగుతారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందినటువంటి విద్యార్థులు ఇటీవల జరిగినటువంటి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు జిల్లా స్థాయి ప్రథమ స్థానం మరియు రాష్ట్రస్థాయికి ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజ్ఞానిక శాస్త్రం చదవడం ద్వారా విద్యార్థులకు చాలా అవగాహన వస్తుందని మరియు పలు విషయాలలో పట్టు సాధిస్తారని ప్రత్యేకంగా విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని వారు తెలిపారు.
విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తున్నామని మరియు వైజ్ఞానిక శాస్త్రంలోని విషయాల పట్ల పరిశోధనాత్మకంగా ప్రత్యక్షంగా బోధించడం ద్వారా వారిలో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని వారు చెప్పారు.
విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీయడానికై ప్రాథమికంగా పరీక్ష నిర్వహిస్తూ చక్కటి ప్రతిభ చాటిన వారికి వివిధ దశలో నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలకు ఎంపిక చేయడం జరుగుతుందని వారు చెప్పారు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో ఏర్పాటు నిర్వహించినటువంటి జిల్లా స్థాయి ప్రదర్శనలో పాఠశాలలకు చెందినటువంటి
విద్యార్థులు ఎంపికైన అని చెప్పారు.
🔅 అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల కొత్తపల్లి
* పి.నిశాంత్, 9వ తరగతి - చెక్కపోడితో ముద్రణ
* ఆండ్రియా మదన్ జోస్ -7వ తరగతి - ఇసుక విద్యుత్
* బి.స్నితిక్, 7వ తరగతి - స్వర్ణ నిష్పత్తి
🔅 అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల - వెదిర
ఎస్.నితీష్ కుమార్ - 10వ తరగతి - హరిత శక్తి
🔅 అల్ఫోర్స్ గర్ల్స్ ఇ-టెక్నో పాఠశాల - వావిలాలపల్లి
* అవిజ్ఞ - 7వ తరగతి - ఆటోమేటిక్ విత్తనాలు
నాటే యంత్రం
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీ రాంమొండయ్య గారు, జిల్లా సైన్స్ అధికారి శ్రీ జైపాల్ రెడ్డి గారు, డిసిఇబి కార్యదర్శి శ్రీ భగవంత రావు గారు అభినందించారు & జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు విజేతలందరికీ పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు
విద్యార్థుల్లో నూతన ఉత్సాహం నింపి అత్యుత్తమ నమూనాలతో ప్రదర్శనకై కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ జాతీయస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ చాటే విధంగా ప్రోత్సాహం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు