Dec 09, 2025, 14:12 IST/మానకొండూర్
మానకొండూర్
నకిలీ బ్యాలెట్ పత్రాలు.. సర్పంచ్ అభ్యర్థి సహా నలుగురిపై కేసు
Dec 09, 2025, 14:12 IST
మానకొండూరు మండలం చెంజర్లలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, నకిలీ నమూనా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేసినందుకు సర్పంచ్ అభ్యర్థి గడ్ది రేణుక (కత్తెర గుర్తు) తో సహా నలుగురిపై కేసు నమోదైంది. ఫుట్‌బాల్ గుర్తు అభ్యర్థి సీరియల్ నంబర్‌ను తప్పుగా ముద్రించి, NOTA స్థానంలో సరైన సీరియల్ నంబర్‌ను ఉంచి ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు వీరు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.