హోంగార్డు డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెద్ద ప్రమాదం

3చూసినవారు
హోంగార్డు డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెద్ద ప్రమాదం
తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిరిసిల్ల డీఎస్పీ వాహన డ్రైవర్ తేజ పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వాహనాన్ని ఆపి, ప్రమాదాన్ని అంచనా వేసి డీఎస్పీకి తెలియజేయడంతో, సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించి వైర్లను సరిచేయడం జరిగింది. డ్రైవర్ తేజ చూపిన చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యత గల వ్యక్తి అని డీఎస్పీతో పాటు పోలీస్ అధికారులు హోంగార్డును అభినందించారు.

సంబంధిత పోస్ట్