
జమ్మికుంట ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై శుక్రవారం హుజూరాబాద్ నుంచి వస్తున్న బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, గాయాలపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.



































