జమ్మికుంటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పాలాభిషేకం

0చూసినవారు
జమ్మికుంటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పాలాభిషేకం
జమ్మికుంటలోని బొమ్మల గుడిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఏడాది పూర్తయిన సందర్భంగా పాలాభిషేకం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మిక సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ బచ్చు శివకుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ, పురాతన దేవాలయాల పరిరక్షణ కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని, సమాజంలో హిందువులు, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టి, అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. హైందవ చైతన్యమే బీజేపీ హిందూ ధార్మిక సంస్థ లక్ష్యమని వారు పేర్కొన్నారు.