వీణవంక సమ్మక్క-సారలక్క జాతర నిర్వహణపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి, ఆయన ప్రత్యర్థి వర్గానికి మధ్య వివాదం తీవ్రమైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసి హుజూరాబాద్‌కు తరలించి రిమాండ్‌కు తరలించే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలో కౌశిక్ రెడ్డి ప్రభుత్వ పరంగా జాతర నిర్వహణకు ఉత్తర్వులు తెచ్చినప్పటికీ, స్థలం తమదని వాదించిన ఉదయానంద రెడ్డి కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పుతో ఉదయానంద రెడ్డి ఆధ్వర్యంలోనే జాతర కొనసాగుతోంది.