
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం.. ప్రయాణికులకు క్షమాపణలు
దేశవ్యాప్తంగా తమ విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంపై 'ఇండిగో' సంస్థ స్పందించింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి రానున్న 48 గంటల పాటు షెడ్యూల్లో సర్దుబాట్లు చేస్తున్నట్లు తెలిపింది. చిన్నపాటి సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణం తదితర కారణాలు ఈ అంతరాయానికి దారితీశాయని సంస్థ పేర్కొంది. ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, రీఫండ్లు అందిస్తున్నట్లు తెలిపింది.




