ఇల్లందకుంటలో నేడు రాములోరికి పట్టాభిషేకం

0చూసినవారు
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేకం మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు 'శేష వాహన సేవ'లో భాగంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని మాడవీధుల గుండా ఊరేగించనున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్