సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య

2686చూసినవారు
సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో సీఆర్పీఎఫ్ జవాన్ పెరుమండ్ల రాజ్ కుమార్ (38) బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. తన చావుకి ఎవరూ కారణం కాదని, నిద్ర పట్టడం లేదని, కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలని సూసైడ్ లేఖ రాసినట్లు తెలిసింది. రాజ్ కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్