గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్లో శనివారం రాత్రి జరిగిన సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈ సందర్భంగా, అలంకరించిన దున్నపోతు అదుపుతప్పి పరుగులు తీయడంతో సూర్యతేజ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కాలు విరగడంతో స్థానికులు వెంటనే స్పందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఆందోళన నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.