కరీంనగర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. 31వ డివిజన్ ఖాన్పురాలోని
టాటా ఆసుపత్రి సమీపంలో రోడ్లపైకి మురికి నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజా సేవా నాయకుడు మజ్హర్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, అధికారులను వెంటనే సమస్య పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.