హుజురాబాద్ పట్టణం ప్రభుత్వ పాఠశాల మైదానంలోని హాకీ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్ ఆధ్యర్యంలో నూతన కమిటిని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీగా బొడిగె తిరుపతి గౌడ్ నియామకమయ్యారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హాకీ టోర్నమెంట్ నిర్వహించుటకు, హాకీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. క్రీడాకారులు పాల్గొన్నారు.