జమ్మికుంటలోని ఓ పాఠశాల హాస్టల్‌లో ఉంటున్న రామ్ చరణ్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూమపానం చేసిన విషయం తెలియడంతో ఉపాధ్యాయులు మందలించి, తల్లిదండ్రులను పిలిపిస్తామని చెప్పడంతో భయపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. విద్యార్థి సంఘాలు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.