ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి గ్రామాలతో పాటు తిరుగుతూ, ప్రజలతో మమేకమై, వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 'చాయ్ తాగినావా? తిన్నవా? మంచిదేనా? ఎటు పోతున్నావ్' వంటి మాటలతో పలకరిస్తూ, తాము సర్పంచ్ లేదా వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.