కరీంనగర్: విషాదం.. వడదెబ్బతో వ్యక్తి మృతి

46చూసినవారు
కరీంనగర్: విషాదం.. వడదెబ్బతో వ్యక్తి మృతి
హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి రమేష్ (45) అనే వ్యక్తి తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వడదెబ్బతో మంగళవారం మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్