కరీంనగర్: విషాదం.. వడదెబ్బతో యువ రైతు మృతి

1చూసినవారు
కరీంనగర్: విషాదం.. వడదెబ్బతో యువ రైతు మృతి
హుజూరాబాద్ మండలంలోని మాందాడిపల్లిలో తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ తగిలి 32 ఏళ్ల యువ వ్యవసాయ కూలీ ఎనగందుల శ్రీకాంత్ మృతి చెందాడు. ఆదివారం పొలంలో పని చేస్తున్నప్పుడు ఎండ వేడిమికి గురైన శ్రీకాంత్, సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి పరిస్థితి విషమించడంతో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. భర్త వడదెబ్బతోనే మరణించాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్