తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చాలెంజ్ విసిరారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని తాను అనలేదని, ఒక వేళ అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలా నిరూపించని పక్షంలో ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ఇవాళ ఓ వీడియోను రిలీజ్ చేశారు.