కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట కెనాల్ కాల్వలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కొత్తపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.