ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ముఖ్య కూడళ్లలో గోడలపై పోస్టర్లను అంటించారు. సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.