కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

0చూసినవారు
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ప్రధాన రహదారిపై అయ్యప్ప కాలనీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇరువురికి గాయాలయ్యాయి. హుజురాబాద్ మండలం సింగపూర్లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు గూడెపు జస్వంత్ రెడ్డి (19) మరియు సాయి చరణ్ కరీంనగర్ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరి స్కూటీని ఢీ కొట్టి పారిపోయింది. ఈ ఘటనలో జస్వంత్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, సాయి చరణ్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుజురాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించారు.

సంబంధిత పోస్ట్