లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు

1చూసినవారు
లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు
జాతీయ రోడ్ భద్రతా మాసోత్సవాలలో భాగంగా, హుజూరాబాద్ లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో డ్రైవర్లు, రోడ్ వినియోగదారులకు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మాధవి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, డిప్యూటీ డిఎం & హెచ్ ఓ, లారీ ఓనర్స్, డ్రైవర్లు, రవాణా, పోలీసు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. సీపీఆర్ ట్రీట్మెంట్, రాహవీర్ స్కీమ్ పై కూడా అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్