హుజురాబాద్: రూ. 16 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

77చూసినవారు
హుజురాబాద్: రూ. 16 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ వొడితల ప్రణవ్ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 39 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 16 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ చెక్కుల పంపిణీ ద్వారా తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో ఆర్థిక సహాయం అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచామని ప్రణవ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్