
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. బోర్డర్ దగ్గర క్యూ కట్టిన బంగ్లాదేశీయులు
పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించిన 'గుర్తించు, తొలగించు, తిప్పి పంపు' విధానం క్షేత్రస్థాయిలో అమలులోకి వచ్చింది. దీంతో అక్రమ వలసదారుల్లో భయం నెలకొంది. మంగళవారం ఉదయం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు భారీగా గుమిగూడారు.




