చల్లూరులో ఘనంగా గుడి బండ్ల జాతర

0చూసినవారు
వీణవంక మండలం చల్లూరులో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. స్వామివారి ఆలయం చుట్టూ జరిగిన శకటోత్సవం (బండ్లు తిరుగుట) భక్తజన సందోహం మధ్య కన్నుల పండువగా సాగింది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శకటాలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్