సరుకులు ఎత్తుకెళ్లిన దుండగులు

1044చూసినవారు
సరుకులు ఎత్తుకెళ్లిన దుండగులు
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఓ దుకాణంలో చోరీ జరిగింది. మొలంగూర్ గ్రామానికి చెందిన తాళ్ళ గణేష్ అనే నిరుద్యోగ యువకుడు నడుపుతున్న సాయిబాబా కిరాణం- టీ స్టాల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల క్రితమే ప్రారంభించిన ఈ షాపును ఆదివారం రాత్రి మూసివేసి వెళ్లగా, సోమవారం ఉదయం తాళం పగులగొట్టి, దాదాపు 8000 రూపాయల విలువైన సిగరెట్ డబ్బాలతో పాటు ఇతర వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.