కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో నేటి నుంచి నూతనంగా 'మంగళవారం అంగడి (సంత)' ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ వారపు సంతలో తాజా కూరగాయలు, నిత్యావసరాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయని సర్పంచ్ మ్యాకమల్ల తిరుమల వెంకటేశ్ తెలిపారు. గ్రామస్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, స్థానిక సంతను ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, వార్డ్ మెంబర్స్, మాజీ ఉపసర్పంచ్ పోసిని సత్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.