ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


May 28, 2026, 05:05 IST/

ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం (వీడియో)

May 28, 2026, 05:05 IST
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా బోరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి తల్లికి గుండెనొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగి, క్షణాల్లో కారు మొత్తం వ్యాపించాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అవ్వడంతో కారులో ఉన్న రామ్‌సింగ్, ఆయన భార్య, తల్లి, జిల్లా పరిషత్ సభ్యురాలు పూసీ దేవి బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.