రాయికల్ మండలానికి మంజూరైన న్యాయస్థానాన్ని వెంటనే ఏర్పాటు చేసి, జీఓ విడుదల చేయాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్ మండలంలో 32 గ్రామాలు, సుమారు 75 వేల జనాభా ఉందని, కోర్టు లేకపోవడంతో ప్రజలు 40 కిలోమీటర్ల దూరంలోని జగిత్యాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాల కేసుల పరిష్కారానికి స్థానికంగా కోర్టు ఏర్పాటు చేయడం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని రాయికల్లో న్యాయస్థానం ఏర్పాటు చేయాలని రాజమౌళి కోరారు.