జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పట్టణంలోని ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ముఠా సభ్యులు వ్యాపారితో పరిచయం పెంచుకుని, ఏకాంతంగా గడిపిన సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి, రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించారు. వ్యాపారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.