సర్పంచ్ పదవి వేలంలో రూ.28.60 లక్షలకు దక్కించుకున్న అభ్యర్థి!

మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సోమవారం VDC ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలం పాట జరిగినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వేలం పాటలో ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా పాట పాడారని చుట్టుపక్క గ్రామప్రజలు తెలిపారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి రూ.28.60 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నాడని సమాచారం. గ్రామంలో మొత్తం 12 మంది నామినేషన్లు వేశారు. వీరందరినీ నామినేషన్ ఉపసంహరించుకోవాలని VDC కోరినట్లు తెలిసింది.
