జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీ పేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ యువతి కనికరపు అంజలి 5043 ర్యాంకుతో రామగుండం సిమ్స్ లో ఎంబిబిఎస్ సీటు సాధించింది. ఆమె విద్య వైద్య కు గల్ఫ్ కార్మికులు తమవంతుగా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామ సర్పంచ్ బెజ్జంకి మోహన్, ఉప సర్పంచ్ ఇద్ధం సుధీర్ రెడ్డి, డాక్టర్ బొమ్మ కంటి అనిల్ కుమార్ గురువారం అంజలికి నగదును అందజేశారు. గ్రామస్తులు గల్ఫ్ కార్మికులను అభినందించారు.