జగిత్యాల జిల్లా ఆత్మకూరు పెట్రోల్ బంక్ వద్ద గంజాయి మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు విద్యాసంస్థలకు చెందిన టూరిస్ట్ బస్సుపై దాడికి పాల్పడ్డారు. అంతకుముందే పల్చోట్ల గొడవలకు దిగిన ఈ పోకిరీలు, బస్సు అక్కడికి రావడంతో దానిపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో వాగ్వాదం పెరిగి పెద్ద గొడవగా మారింది. విద్యాసంస్థల చైర్మన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు తెలుసుకొని న్యాయం చేస్తామని తెలిపారు.