జగిత్యాల: రూ.12,000 కోసం దారుణ హత్య

1995చూసినవారు
జగిత్యాల పట్టణంలో రూ. 12 వేల బాకీ తీర్చలేదని స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 31న జగిత్యాల పట్టణానికి చెందిన బాసోజి శ్రీనివాస్, అతని కొడుకు వేణు చారీలు కలిసి కొలగాని అంజయ్యపై దాడి చేసి చంపినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ కేసులో నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. అంజయ్యకు శ్రీనివాస్ రూ. 12 వేలు ఇవ్వాల్సి ఉండగా, డబ్బులు అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారని సీఐ వివరించారు.

సంబంధిత పోస్ట్