అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి చేస్తా అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని 47 వ వార్డు లో 30 లక్షలతో, 48వ వార్డులో 40 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ చాంద్ పాషా పాల్గొన్నారు.