తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా శాఖ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని ధరూర్ క్యాంపు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించారు. హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్ లో జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, చింత నరేష్ లను సన్మానించారు.