జగిత్యాల: డాక్టరేట్ అందుకున్న కళాకారునికి కళాశ్రీ సన్మానం

65చూసినవారు
జగిత్యాల: డాక్టరేట్ అందుకున్న కళాకారునికి కళాశ్రీ సన్మానం
దళిత బంధు, రాజకీయ విశ్లేషకుడు, గాయకుడు పేట భాస్కర్ ఇటీవల డాక్టరేట్ అందుకుని శనివారం జగిత్యాలకు విచ్చేసిన సందర్భంగా కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ అధినేత గుండేటి రాజు ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. డాక్టర్ పేట భాస్కర్ కళా రంగానికి, రాజకీయ రంగంలో అందిస్తున్న సేవలు ముందు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని కళాశ్రీ గుండేటి రాజు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలె శంకర్, దుమాల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్