జగిత్యాల: ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు

16చూసినవారు
జగిత్యాల: ఎన్నికల కోడ్ ముగిసేవరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు
జగిత్యాల కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిలిపివేయబడుతుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.