జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ గౌడ్(29) ప
ొలాండ్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉపాధి కోసం రెండున్నరేండ్ల కింద పోలాండ్ దేశానికి వెళ్లిన మనోజ్ అక్కడే పిస్కీ గ్రామంలో ఉంటున్నాడు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నడుచుకు
ంటూ వెళ్తున్న క్రమంలో వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మనోజ్ మృతిచెందాడు. కాగా అతడు ఐదు నెలల కింద ఇంటికి వచ్చి వెళ్లాడు.