జగిత్యాల: ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి

52చూసినవారు
జగిత్యాల: ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి
ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తా వద్ద శనివారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే, ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారితో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్