ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి, ప్రస్తుత నివాసం జగిత్యాలకు చెందిన వడ్లూరి నాగరాజును శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. ఇతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, ఇటీవల మడేలేశ్వర స్వామి దేవస్థానంలో దొంగిలించిన 10గ్రాముల వెండి స్వాదీనం చేసుకున్నట్టు సీఐ వివరించారు.