జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎన్ఎస్ఎస్, హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు యన్ సంగీత రాణి డి సుజాత జి శ్రీలత, హెల్త్ క్లబ్ కోఆర్డినేటర్ నీరజ జనాభా విస్పోటనం వలన కలిగే లాభనష్టాలు దుష్పరిణామాలు ఫలితంగా దేశంలో పేదరికం నిరుద్యోగం గురించి వివరించారు.